అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రిలో కాలేయ క్యాన్సర్‌కు విజయవంతంగా అధునాతన చికిత్స
రిపోర్టర్: రాజేష్
స్థలం: Anantapur
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చీకలగురికి గ్రామానికి చెందిన 64 ఏళ్ల ఎర్రిస్వామి అనే వ్యక్తి కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతుండగా అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స లేకుండా అధునాతన ట్రాన్స్ఆర్టీరియల్ కీమో-ఎంబోలైజేషన్ ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఎస్.కె. పృథ్వీరాజ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి. వెంకట సింహా పర్యవేక్షణలో ఈ వైద్యం నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.