బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శ్రీకాకుళం యువకుడు రామకృష్ణ
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
బిగ్ బాస్ హౌస్లోకి ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా శ్రీకాకుళానికి చెందిన రామకృష్ణ ఎంట్రీ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. చదువు పూర్తి చేసుకుని పోలీస్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రామకృష్ణ, మూడో ప్రయత్నంలో ఈ రియాలిటీ షోకి సెలెక్ట్ అయినట్లు సమాచారం. అంతకుముందు పలువురు నటులు, డ్యాన్సర్లు కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి అడుగుపెట్టారు.