ముంబయిలో సీజేపీ ఆందోళనల కలకలం: ప్రతిగా తెరపైకి జెన్ నెక్స్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Mumbai
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముంబయిలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను వ్యతిరేకిస్తూ జెన్ నెక్స్ట్ ముంబయి పేరుతో యువత రంగంలోకి దిగడంతో పరస్పర ఆందోళనలు చెలరేగాయి. సీజేపీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నామని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తాము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని జెన్ నెక్స్ట్ ముంబయి ప్రతినిధులు స్పష్టం చేసినట్లు అభిజీత్ దీప్కే వెల్లడించారు.