గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం

రిపోర్టర్: మహేష్ స్థలం: పార్వతీపురం మన్యం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో యాభై నుంచి డెబ్బై మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయనున్నారు. వారికి మూలధనం, నైపుణ్య శిక్షణతో పాటు మార్కెట్ మద్దతు అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.