అంబేద్కర్ యూనివర్సిటీ లో క్రీడా కోర్సులకు మార్గం సుగమం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కి ఎన్సీటీఈ నుండి శుభవార్త అందిందని వీసీ రజని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఎంపీఈడీ, బీపీఈడీ కోర్సులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ లభించిందని ఆమె పేర్కొన్నారు. యూనివర్సిటీ లో అన్ని వసతులు ఉన్నాయని ఎన్సీటీఈ సంతృప్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు. నిర్ణీత గడువులోగా నిబంధనలు పూర్తి చేసి త్వరలో కోర్సులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.