దళితుల సమస్యల పరిష్కారానికి డీహెచ్‌పీఎస్ పోరుబాట!
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెంసూరు
ఖమ్మం జిల్లా వెంసూరు మండలం కందుకూరులో డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి వెంగళ ఆనందరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం హామీలను అమలు చేయాలని కోరారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల సాయం, ఇంటి స్థలాల పట్టాలు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగం వంటి డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.