ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరం అయిన సౌతాఫ్రికా పేసర్ ఓట్నీల్ బార్ట్‌మాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: World

ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా పేసర్ ఓట్నీల్ బార్ట్‌మాన్ టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో దువాన్ జాన్సెన్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే కగిసో రబాడ కూడా గాయంతో అందుబాటులో లేకపోవడం ప్రొటిస్ జట్టుకు పెద్ద ఆందోళన కలిగించే విషయంగా మారింది.