విశాఖలో మానవత్వం: అవయవదానంతో ముగ్గురు రోగులకు కొత్త జీవితం ప్రసాదించిన బాలుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన 17 ఏళ్ల మజ్జి రమేష్ అవయవదానంతో ముగ్గురు రోగులకు కొత్త జీవితం లభించనుంది. అనంతగిరి మండలానికి చెందిన రమేష్ ఈ నెల 16న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలోని కిమ్స్ ఆసుపత్రిలో చేరగా, వైద్యులు అక్టోబర్ 18న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. పుత్రశోకంలోనూ తల్లిదండ్రులు ముందుకు వచ్చి అవయవదానానికి అంగీకరించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ వి. మన్మధరావు సమన్వయంతో వైద్యులు రమేష్ రెండు కిడ్నీలు, లివర్‌ను సేకరించి బాధితులకు అమర్చారు.