'మూలధన విలువ ఆధారంగానే ఆస్తి పన్ను': క్యూర్ పరిధిలో కొత్త విధానం అమలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
క్యూర్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ను కాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్ అర్బన్ రీజియన్ బిల్-2026లో ఈ అంశాన్ని పొందుపర్చగా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ గైడ్లైన్ వాల్యూను మూలధన విలువగా పరిగణించి పన్ను లెక్కించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా మూడు కార్పొరేషన్లలో సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.