వైట్ బాల్ క్రికెట్ లో రిషబ్ పంత్ భవితవ్యంపై ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: India

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వైట్ బాల్ క్రికెట్ భవితవ్యంపై సెలక్టర్లు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే జట్టు నుంచి పంత్‌ను తప్పించగా, ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు మాత్రం అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. టెస్టు క్రికెట్‌లో పంత్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ, వన్డేల్లో మాత్రం అతడిని పక్కన పెట్టడం గమనార్హం.