మాజీ మంత్రి కాకానికి ఘన సన్మానం చేసిన రవీందర్ రెడ్డి
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణ మండపంలో వైయస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన కుమార్తె, రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనుబోలు గ్రామ వైయస్సార్సీపీ అధ్యక్షుడు ముంగర రవీందర్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.