'రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో అనంతపురం పోలీసుల సత్తా': మొత్తం 36 పతకాలు సాధించి అదుర్స్!
రిపోర్టర్: రమేష్
స్థలం: Anantapur
రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో అనంతపురం జిల్లా పోలీసులు సత్తా చాటారు. మొత్తం 36 పతకాలను సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇందులో 4 స్వర్ణం, 22 రజతం, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఘన విజయం సాధించిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించి, ప్రశంసించారు.