అమెరికాలో వైభవంగా దుర్గా ఉత్సవ్: టైమ్స్ స్క్వేర్లో ప్రత్యేక పూజలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూయార్క్

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వేదికగా దుర్గా ఉత్సవ్ అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో భారతీయ ప్రవాసులు, బెంగాలీలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దశ మహావిద్య నృత్య నాటకం ఎంతగానో ఆకట్టుకున్నాయి. న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ బినయ్ ప్రధాన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.