స్థానిక ఎన్నికలపై చంద్రబాబు, జడ్జిల మధ్య కుట్ర: పేర్ని నాని
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు అడ్డంగా ఉన్న కేసులన్నింటినీ ఈ నెల 30లోగా కొట్టేస్తానని ఓ ఉన్నత స్థాయి జడ్జి సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, 18 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.