వృద్ధుల హక్కులు మరియు రక్షణపై అవగాహన పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా వృద్ధుల హక్కులు, సంరక్షణపై రూపొందించిన ఎల్డర్ గైడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వృద్ధులకు మెరుగైన వసతులు, రక్షణ కల్పించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సదుపాయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.