మహిళలకు మళ్లీ చదువుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్నామన్న మంత్రి సీతక్క

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

మహిళలు మధ్యలో ఆపేసిన చదువును మళ్లీ కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటి నుంచే 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించవచ్చన్నారు. అక్షరాస్యత సాధించిన మహిళలు పరీక్షలు రాసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.