ఎన్నికల సిబ్బందికి తప్పని ఇట్లు: ప్లాస్టిక్ గ్లాసుల్లోనే భోజనం చేసిన వైనం

రిపోర్టర్: రాజేష్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి చాలీచాలని భోజనం పెట్టడంతో పాటు కనీసం తినేందుకు ప్లేట్లు కూడా ఇవ్వలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక వారు మంచినీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాసుల్లోనే అన్నం, సాంబారు వేసుకొని కడుపు నింపుకోవాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. ఈ వైఫలయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.