దేశవ్యాప్తంగా సున్నా జనాభాతో మనుగడ కోల్పోతున్న ముప్పై వేల ఊళ్లు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
భారతదేశంలో ప్రభుత్వ గుర్తింపునకు నోచుకోక, కనీస వసతులు లేక వేలాది గ్రామాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఎలాంటి జనాభా లేని ఏకంగా ముప్పై రెండు వేలకు పైగా ఘోస్ట్ విలేజెస్ ఉన్నట్లు మిషన్ అంత్యోదయ డేటా స్పష్టం చేసింది. ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఇలాంటి నిర్జన గ్రామాలు అధికంగా ఉన్నాయని, ఉపాధి అవకాశాలు కరవు కావడంతోనే ప్రజలు వలస వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.