ఏపీలో మరో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు: ఉత్తర్వులు జారీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, గుంటూరు నగరాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ నూతన కమిషనరేట్లకు ఐజీపీ, డీఐజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారులు కమిషనర్లుగా వ్యవహరించనున్నారని అధికారులు స్పష్టం చేశారు.