కరకంబాడి రాస్ ఆఫీస్లో భక్తిశ్రద్ధలతో సామూహిక లక్ష్మీ పూజ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రేణిగుంట

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి రాస్ ఆఫీస్లో సామూహిక లక్ష్మీ పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. వి. నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు రెండు వందలకు పైగా మహిళలు హాజరయ్యారు. పూజా సామాగ్రిని సంస్థే ఏర్పాటు చేయగా, భక్తులు ప్రసాదాలతో పాల్గొన్నారు. సంఘాల సభ్యులు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని నాగరాజు పేర్కొన్నారు.