కోలీవుడ్ లో సంచలనం: ధనుష్ కు బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపిన సూర్య

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

తన సినిమా విడుదల తేదీని మార్చుకున్నందుకు నటుడు ధనుష్ కు ప్రముఖ హీరో సూర్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ, బాక్సాఫీస్ క్లాష్ నివారించేందుకు ధనుష్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సీన్ సినిమా నవంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది.