నవీముంబైలో ప్రత్యర్థిపై కత్తితో దాడి చేసిన కాంట్రాక్టర్ అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Navi Mumbai
నవీముంబైలోని శిరవాణె గ్రామంలో వ్యాపార పోటీ కారణంగా రఫీక్ అమీరుద్దీన్ ఖాన్ అనే వ్యక్తిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంజయ్ రాజ్పుత్ అనే లేబర్ కాంట్రాక్టర్ను పోలీసులు ఆరు గంటల్లోనే అరెస్టు చేసినట్లు నెరుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ లాడ్ తెలిపారు. పరారవుతున్న నిందితుడిని బాంద్రా రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచి ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరలించినట్లు ఆయన వెల్లడించారు.