సినిమా సమీక్ష: భారీ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ చిత్రం

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన రామాయణ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రల్ లో నటించిన ఈ పౌరాణిక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్మీకి రామాయణాన్ని ఆధునిక సాంకేతికతతో తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కు ఓవర్సీస్ లో మంచి స్పందన లభిస్తోంది. అద్భుతమైన దృశ్యాలు, నటీనటుల అభినయం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని సినీ విశ్లేషకులు తెలిపారు.