ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు బీజేపీ నేత భార్య కుట్ర

రిపోర్టర్: వెంకట్ స్థలం: Tirupati

తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీజేపీ మండల అధ్యక్షుడు మునిరాజాను హత్య చేసేందుకు ఆయన భార్య ప్రశాంతి ప్రియుడు సాయితో కలిసి దారుణ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. ఈ నెల 13న మునిరాజా బైక్కు నిందితులు నిప్పు పెట్టగా, సీసీటీవీ టేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భార్య ప్రశాంతి అక్రమ సంబంధం బయటపడటంతో పాటు, నలుగురు యువకులతో కలిసి ఆమె భర్తను అంతమొందించేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.