పెన్సిల్వేనియా కుటుంబాలకు భారీ ఊరట: పది లక్షల డాలర్లు విరాళమిచ్చిన ప్రముఖ జంట

రిపోర్టర్: విజయ్ స్థలం: Pennsylvania

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో నివసించే నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్, ఆమె భాగస్వామి ట్రావిస్ కెల్సే ముందుకు వచ్చారని హెల్పింగ్ హార్వెస్ట్ ఫ్రెస్ట్ ఫుడ్ బ్యాంక్ అధ్యక్షుడు జే ల్ తెలిపారు. ఆ సంస్థకు పది లక్షల డాలర్ల భారీ విరాళాన్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలున్న ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో ఈ సాయం ఎంతో కీలకమని నిర్వాహకులు వెల్లడించారు.