జైలర్ 2 చిత్రంలో బోధి కల్పక్ పాత్రలో ఎస్ జే సూర్య
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య బోధి కల్పక్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.