శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గించాలంటూ నితిన్ గడ్కరీ పిలుపు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో శిలాజ ఇంధనాల దిగుమతుల కోసం ఏటా రూ.22 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. చెరకు వ్యర్థాలు, వరి గడ్డి నుంచి ఇథనాల్ తయారీకి మళ్లాలని చక్కెర మిల్లులకు ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంతో పాటు రైతులకు టన్నుకు రూ.6,000 వరకు అదనపు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.