విశాఖలో ఒకే బంగారంతో కోటి రూపాయలు టోకరా వేసి పరారైన మహిళ

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

బంగారం టేకోవర్ పేరుతో పలువురి వద్ద సుమారు కోటి రూపాయలు వసూలు చేసి మహిళ పరారైనట్లు బాధితులు ఆరోపించారని విశాఖపట్నం పోలీసులు తెలిపారు. ఒకే బంగారాన్ని తాకట్టు నుంచి విడిపిస్తామంటూ నమ్మించి బమ్మిడి ఝాన్సీ అనే మహిళ పలువురి నుంచి నగదు కాజేసినట్లు బాధితులు వాపోయారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మేనేజర్ సాయివర్మ, తన భర్త శివకుమార్తో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు బాధితులు మీడియా సమావేశంలో వెల్లడించి పోలీసులను ఆశ్రయించారు.