హఫీజ్ పేట్ లో మహిళపై హోంగార్డ్ అమానుష దాడి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై హోంగార్డ్ విచక్షణారహితంగా దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు, నిందితుడు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాదని, తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హోంగార్డు అని స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సదరు హోంగార్డు డిప్యుటేషన్ రద్దు చేసి తదుపరి చర్యల నిమిత్తం తెలంగాణ పోలీసు విభాగానికి అప్పగించినట్లు వెల్లడించారు.