నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యపై సమగ్ర న్యాయ విచారణ జరపాలి
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం
జూలూరుపాడు మండలం వెంకన్నపాలెంకు చెందిన నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జూలూరుపాడులో శాంతియుత విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. మహిళలు, బాలికలపై హింసను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హరిణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.