ఈస్గాం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై: బాధ్యతలు స్వీకరించిన ఈ. వెంకటేష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాగజ్ నగర్
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా ఈ. వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సైకి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పోలీసు శాఖకు నిత్యం సహకరించాలని ఎస్సై వెంకటేష్ కోరారు.