'మాకు సోషల్ టీచర్ కావాలి..': బయ్యారంలో విద్యార్థినుల రోడ్డుపై ఆందోళన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని జెడ్పీఎస్‌ఎస్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయురాలు లేకపోవడంతో విద్యార్థినీలు గురువారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. గత నాలుగేళ్లుగా సోషల్ టీచర్ లేక తమ చదువులు దెబ్బతింటున్నాయని, వెంటనే ఉపాధ్యాయురాలను నియమించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు.