అమెరికా ఎన్నికల్ లో కోట్ల ఓట్లను అంత వేగంగా ఎలా లెక్కిస్తారు
రిపోర్టర్: సురేష్
స్థలం: అమెరికా
అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్ లో కోట్ల ఓట్లను అత్యంత వేగంగా లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ స్కానర్లను ఉపయోగిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. పేపర్ బ్యాలెట్ల ద్వారా పోలింగ్ నిర్వహించినప్పటికీ, హైస్పీడ్ మెషీన్ల సహాయంతో గంటల వ్యవధిలోనే ఓట్లను లెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ప్రీ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు ముందే పరిశీలన ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయని, మీడియా సంస్థల అధ్యయనాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.