గోదావరిఖని రుద్ర యాగంలో ప్రజల శ్రేయస్సును కోరుతూ మనాలి ఠాకూర్ పూజలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గోదావరిఖని
గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో జరుగుతున్న మహా రుద్ర యాగంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సుభిక్షాలతో జీవించాలని పరమశివుడిని మనసారా ప్రార్థించారు. ఆలయ అర్చకులు వారికి వేద మంత్రోచ్ఛారణలతో తీర్థప్రసాదాలు అందజేశారు.