తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్ వైపు మురాసు తుఫాను

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారిందని, ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తోందని భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. నెల్లూరు - నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్ లోని పలు జిల్లాలకు యెల్ లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేశారు.