ఏఐ రంగంలో అమెరికాను అగ్రగామిగా నిలపడమే లక్ష్యమన్న ట్రంప్

రిపోర్టర్: విజయ్ స్థలం: అమెరికా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికాను ప్రపంచంలోనే తిరుగులేని అగ్రగామిగా నిలపడంతో పాటు చైనాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏఐ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఒక ఏఐ జార్ నియామకాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించిన ఆయన ఏఐ రంగాన్ని అణచివేసే ఎలాంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేస్తూ ఈ టెక్నాలజీ పేరు మార్పుపై ప్రజల నుంచి ఓటింగ్ కోరుతూ వినూత్న సర్వే చేపట్టారు.