నెట్ఫ్లిక్స్ వేదికగా భారీ టాక్ షోతో మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ తో కలిసి ప్రముఖ నటుడు చిరంజీవి ఒక భారీ టాక్ షో ద్వారా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారని సినీ వర్గాలు వెల్లడించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం కలిగిన ఆయన ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.