బుచ్చయ్యపల్లి పాఠశాలలో విద్యార్థులకు యూనిఫారాల పంపిణీ
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జాడి మహేశ్వర్ విద్యార్థులకు స్వయంగా యూనిఫారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయురాలు స్నేహ, వెలుగు సీసీ ప్రసాద్, సీఏ శ్రీనివాస్, మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి పానుగంటి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.