జగ్గయ్యపేటలో పరిశ్రమల కాలుష్యంపై ప్రజల తీవ్ర ఆందోళన
రిపోర్టర్: అశోక్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఫార్మా, రసాయన పరిశ్రమల వ్యర్థాలతో ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. నిబంధనలు విస్మరించి వ్యర్థాలను భూగర్భంలోకి వదులుతుండటంతో నీరు కలుషితమై పసుపు రంగులోకి మారుతోంది. అధికారుల మొక్కుబడి తనిఖీలపై స్థానికులు మండిపడుతున్నారు. కాలుష్య భయంతో జనాలు ఆటోనగర్ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.