ట్యాంక్బండ్ వద్ద గణేశ్ నిమజ్జనంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

హైదరాబాద్లోని ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతుండటంతో పోలీసులు వాహనాలను నిలిపివేశారని ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ ఉడుముల (Sudhakar Udumula - TOI Investigative Editor) పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. దీనివల్ల నిత్యం పని నిమిత్తం ప్రయాణించే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.