స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల రాజకీయం: కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైనం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయని విశ్లేకులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితి నిబంధనలను అధిగమించడం అసాధ్యమని తెలిసినప్పటికీ, ప్రభుత్వాలు జీవోలు తెచ్చి కాలయాపన చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ పాలనలోనూ ఇదే తరహాలో నాటకాలు నడిచాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.