రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడి మానవత్వం చాటిన సిరి సహస్ర

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తెర్లం

ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి మజ్జి సిరి సహస్ర వెంటనే స్పందించారు. రాజీపేట జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొని గాయపడిన క్షతగాత్రులను తన కారులో ఆసుపత్రికి తరలించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రచారం కంటే ప్రాణ రక్షణే ముఖ్యమని భావించి ఆమె చూపిన చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.