వైరల్ అవుతున్న నాని ది ప్యారడైజ్ రగ్గడ్ లుక్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి నాని కొత్త పవర్‌ఫుల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రగ్గడ్ గెటప్‌లో తుపాకీ పట్టుకుని ఉన్న నాని లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.