పెందుర్తి రోడ్డు ప్రమాదంలో మామ మేనల్లుడు మృతి

రిపోర్టర్: సురేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెండున్నరేళ్ల బాలుడు దేవ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో బాలుడి మేనమామ బోను రాంబాబు అక్కడికక్కడే మృతి చెందగా, రోజు వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కళ్లికోట గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.