ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సూళ్లూరుపేట శాసనసభ్యులు డా. నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు ఎక్కడి నుంచో ఊడిపడవని, ముఖ్యమంత్రిని కలిసి ప్రతిపాదనలు సమర్పిస్తేనే నిధులు వస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అయిందని ఆమె స్పష్టం చేశారు.