అనపర్తిలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ గుట్టురట్టు: ముగ్గురు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: అనపర్తి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ ఉదంతంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య వెల్లడించారు. అనపర్తి శివారులో అదృశ్యమైన బాలుడిని సాంకేతిక ఆధారాలతో పిఠాపురంలో పోలీసులు సురక్షితంగా రక్షించారు. నిందితులు బాలుడిని నగరాలకు తరలించి విక్రయించడానికి పథకం పన్నారని డీఎస్పీ స్పష్టం చేశారు. కేసును విజయవంతంగా ఛేదించిన ప్రత్యేక బృందాలను ఆమె అభినందించారు.