'ఉగ్రవాదం అంతం.. ప్రశాంతత సంతకం': జమ్మూ కాశ్మీర్లో కొత్త అధ్యాయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: జమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఒక్క రాళ్ళ దాడి ఘటన కూడా నమోదు కాలేదని, స్థానిక ఉగ్రవాద నియామకాలు కేవలం ఒక్కటికి పడిపోయాయని తెలిపింది. సరిహద్దు భద్రత, సైనిక దళాల నిరంతర ఆపరేషన్లతో హింస పూర్తిగా తగ్గిపోయిందని, పహల్గామ్ ఉగ్రదాడిని సైతం లెక్కచేయకుండా రికార్డు స్థాయిలో 2.3 కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించి సాధారణ స్థితికి అద్దం పట్టారని నివేదిక స్పష్టం చేసింది.