సింటా బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఉపాసన సింగ్ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Mumbai
సింటా బ్యాంకు ఖాతాల నిర్వహణపై మాజీ కార్యవర్గ సభ్యురాలు ఉపాసన సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కమిటీ రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలను నిలుపుదల చేయాలని తాము కోరినట్లు ఆమె తెలిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను తెరిచి ఫిక్స్డ్ డిపాజిట్ల నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ్యుల అనుమతి లేకుండా ఎఫ్డీలను ఎలా బ్రేక్ చేస్తారని ఉపాసన సింగ్ నిలదీశారు.