తెలుగులో రానున్న ప్రముఖ రియాలిటీ గేమ్ షో ది ట్రైటర్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ పదిహేను నుంచి ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షో ప్రసారం కానుందని అమెజాన్ స్టూడియోస్ హెడ్ నిఖిల్ మాధోక్ తెలిపారు. హీరో తేజ సజ్జ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ హై-ఆక్టేన్ షోలో ఇరవై మంది ప్రముఖులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. నాలుగు వారాల పాటు పది ఎపిసోడ్స్గా సాగే ఈ మైండ్ గేమింగ్ షో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికే హిందీలో రెండు విజయవంతమైన సీజన్ల తర్వాత ఈ గ్లోబల్ ఫ్రాంచైజ్ తెలుగులోకి వస్తోంది.