మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
మెగా డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న ఆరోపణలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణి ఖండించారు. టెట్ అర్హతలు, క్రీడా కోటా నియామకాలు పూర్తి పారదర్శకంగా నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను వేధిస్తే లేదా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.